×
Ad

Ram Charan : రాజ్‌కుమార్ హిరానీతో రామ్‌చరణ్ కథ చర్చలు.. నిజమేనా..?

రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో ఒక మూవీ చేసేందుకు కథ చర్చలు జరుపుతున్నారట.

  • Published On : October 6, 2023 / 12:36 PM IST

Ram Charan Bollywood movie with Rajkumar Hirani is it real

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. RRR సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో ఒకప్పుడు చరణ్ తో సినిమాలు చేయడానికి ఆలోచించిన బాలీవుడ్ మేకర్స్ సైతం.. తన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు చరణ్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఎందుకో ఫలించడం లేదు. గతంలో ‘జంజీర్’ విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని రామ్ చరణ్ జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే కథల ఎంపీలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించి ఒక న్యూస్ బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవల చరణ్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే ఇండియన్ మాజీ కెప్టెన్ ధోనీని కలుసుకున్న రామ్ చరణ్.. మరో వ్యక్తిని కూడా భేటీ అయ్యినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీని చరణ్.. ఒక సినిమా విషయంలో కలిశాడట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట.

Also read : Prabhas : ఓరి మీ దుప్పలుతెగ.. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని.. అభిమానులు ఏం చేశారో చూశారా..?

ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాసుకొస్తుంది. మున్నా భాయ్, 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన హిరానీ.. కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు షారుఖ్ ఖాన్‌తో ‘డంకీ’ తెరకెక్కిస్తున్నాడు. హిరానీ సినిమాల్లో ఎమోషన్ తో పాటు యాక్టింగ్ బాగా స్కోప్ ఉంటుంది. ఆయన సినిమాల్లో నటించడం చాలా ఛాలెంజింగ్ భావిస్తారు. అలాంటిది ఇప్పుడు హిరానీతో చరణ్ మూవీ అంటే.. అభిమానుల్లో ఎంతో ఆసక్తి మొదలయింది.