Ram Charan : అలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే… ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో చరణ్ కామెంట్స్..
పెద్ది థ్యాంక్యూ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. (Ram Charan)
- Saketh U
- Published on- June 8, 2026 / 05:41 PM IST
Ram Charan
Ram Charan : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పెద్ది సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ అభినందిస్తున్నారు. అసలు ఇలాంటి పాత్రను ఓకే చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. నేడు ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.
పెద్ది థ్యాంక్యూ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను స్వతహాగా నన్ను నేను పుష్ చేసుకొని బుచ్చిబాబుని నమ్మి ఈ సినిమా చేసినందుకు చాలా సంతృప్తిగా ఉంది. సినిమా కలెక్షన్స్ కానీ, ఒక మంచి సినిమా వస్తే చూపించే ప్రేమ కానీ దీనికి వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి సినిమా చూసాను. ఆడియన్స్ ఊహించని సీన్స్ కి కూడా చప్పట్లు కొడుతున్నారు.
బుచ్చికి థ్యాంక్స్. నా కెరీర్ లో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. మొదటిసారి కథ విన్నప్పుడు బుచ్చికి హగ్ ఇచ్చాను. స్వచ్ఛమైన మనసుతో కష్టపడి చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే. జగపతి బాబు పాత్రని స్క్రీన్ పై చూసి కన్నీళ్లు వచ్చాయి. అన్ని రకాల ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకు వస్తున్నారు. సెకండ్ హాఫ్ సీన్స్ మేము ఎంత కష్టపడి చేసినా రహమాన్ గారు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఎలివేట్ చేసింది. ఈ సినిమాని 185 రోజులు షూట్ చేసాము అని తెలిపారు.
