×
Ad

Ram Charan : రామ్ చరణ్ కూతురి ఫేస్ రివీల్ అయ్యిపోయింది.. ఎంత క్యూట్‌గా ఉంది..

రామ్ చరణ్ కూతురి క్లీంకార ఫేస్ రివీల్ అయ్యిపోయింది. వైరల్ అవుతున్న వీడియో.

  • Published On : March 27, 2024 / 10:19 AM IST

Ram Charan daughter KlinKara face revealed video gone viral

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే నేడు కావడంతో సోషల్ మీడియా అంతా చరణ్ నామసరణ జరుగుతుంది. ఒక పక్క మూవీ అప్డేట్స్, మరో పక్క ఫ్యాన్స్ స్పెషల్ పోస్టులతో టైంలైన్ అంతా మెగా పవర్ మ్యానియా కనిపిస్తుంది. కాగా రామ్ చరణ్ తన పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోవడానికి నిన్న తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార పాల్గొని శ్రీవారి అశీసులు తీసుకున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలోని క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది. రామ్ చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ ని రివీల్ చేయలేదు. మెగా అభిమానులంతా మెగా ప్రిన్స్ ఫేస్ ని చూడడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వైజాగ్ బీచ్ లో చరణ్, క్లీంకారతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో సైడ్ నుంచి క్లీంకార ఫేస్ కనిపిస్తేనే తెగ సంతోషపడిపోయారు.

Also read : Game Changer : జరగండి జరగండి జరగండి.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ వచ్చేసిందండి..

ఇప్పుడు ఏకంగా ఫ్రంట్ నుంచి క్లీంకార ఫేస్ కనిపించేసింది. దీంతో అందుకు సంబంధించిన వీడియో అండ్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. గుడిలోకి వెళ్తున్న సమయంలో క్లీంకార ఫేస్ కెమెరా లెన్స్ కి చిక్కింది. ఇక క్లీంకార ఫేస్ చూసిన అభిమానులు.. ఎంత క్యూట్ గా ఉందంటూ సోషల్ మీడియాలోనే తెగ ముద్దాడేస్తున్నారు. మరి ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.

ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి రామ్ చరణ్, కియారా వేసిన డాన్స్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక శంకర్ డిజైన్ చేసిన సాంగ్ విజువల్ వండర్ అనిపిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు.