×
Ad

Ram Charan : టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన రామ్ చరణ్

తాజాగా టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి రామ్ చరణ్ రంగంలోకి దిగారు. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్ కి ఉన్న సమస్యలని చెప్పడంతో పాటు హీరోల సైడ్ నుంచి ఉన్న సమస్యలని........

  • Published On : July 27, 2022 / 12:04 PM IST

Ram Charan

Ram Charan :  గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అందులో ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని అంతర్గత ఇబ్బందులు, హీరోల రెమ్యునరేషన్స్.. ఉన్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటుండటంతో సినీ పెద్దలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశం అయి సమస్యలపై చర్చించి, సమస్యలు సాల్వ్ అయ్యేదాక షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించారు.

షూటింగ్స్ బంద్ పై భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి రామ్ చరణ్ రంగంలోకి దిగారు. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్ కి ఉన్న సమస్యలని చెప్పడంతో పాటు హీరోల సైడ్ నుంచి ఉన్న సమస్యలని ప్రస్తావించి హీరోలందరితో మాట్లాడమని అడిగారు. దీనికి రామ్ చరణ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

Dulquer Salmaan : తెలుగులో పాతుకుపోతున్న దుల్కర్..

ముఖ్యంగా దిల్ రాజు హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించాలని, హీరోల అసిస్టెంట్స్ కి ఖర్చులు వారే పెట్టుకోవాలని, టైమ్ సెన్స్ పాటించాలని, హీరోల డేట్స్ అడ్జస్ట్ చేయడంలో మేనేజర్స్ తో సమస్యలు ఉన్నాయని రామ్ చరణ్ కి తెలిపారు. రామ్ చరణ్ వచ్చే వారంలో టాలీవుడ్ హీరోలందరితో సమావేశం అయి ఈ సమస్యలపై చర్చిస్తాను అని దిల్ రాజుకి తెలిపారు. హీరోల సైడ్ నుంచి ఉన్న సమస్యల గురించి నేను మాట్లాడతాను అని ప్రొడ్యూసర్ గిల్డ్ కి చరణ్ భరోసా ఇచ్చారు. రంగంలోకి రామ్ చరణ్ దిగడం, వచ్చే వారం హీరోలందరితో చరణ్ మాట్లాడతాను అనడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు నిర్మాతలు.