Ram Charan : నేను మానసికంగా కృంగిపోయాను.. అప్పుడు రాజమౌళి ఏం చెప్పాడంటే.. చరణ్ కామెంట్స్..

ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ - బుచ్చిబాబు కలిసి కార్ లో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చరణ్. (Ram Charan)

  • Updated on- May 21, 2026 / 03:21 PM IST

Ram Charan

Ram Charan : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చరణ్ మూడు గేమ్స్ ఆడుతూ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ – బుచ్చిబాబు కలిసి కార్ లో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చరణ్.

ఈ క్రమంలో చరణ్ కరోనా సమయంలో మానసికంగా చాలా లో ఫీల్ అయ్యానని, అపుడు రాజమౌళి ఓ సలహా ఇచ్చారని తెలిపాడు.

Also Read : Ram Charan : ఆ సినిమా ఆగిపోయినందుకు బాధపడ్డా.. 15 ఏళ్ళ తర్వాత నా కల నెరవేరింది.. చరణ్ కామెంట్స్ వైరల్..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. కరోనా అందరికి ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించింది. నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. నేను ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నా అప్పుడు. RRR షూటింగ్ మధ్యలో లాక్ డౌన్ వచ్చింది. ఆ సినిమా కోసం బాడీ బాగా చేసి ఉన్నాను. జిమ్ కి వెళ్ళడానికి లేదు. చుట్టూ మనుషులు చనిపోతున్నారు. అప్పుడు మేము ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. ఉపాసన కరోనా సమయంలో కాల్స్ లోనే ఇంటి నుంచి వర్క్ చేస్తూ అపోలో పనులు చూసుకునేది. నేను ఒక రూమ్ లో తను ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. నాకేం చేయాలో తెలియక సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని.

మూడు నెలలు అలా సింగిల్ గా ఉండేసరికి బాగా నెగిటివ్ థాట్స్ వచ్చాయి. నేను మానసికంగా కొంచెం డిప్రెషన్, కృంగిపోయాను అని చెప్పను కానీ అలాగే లో ఫీల్ అయ్యాను. లాక్ డౌన్ త్వరలో ఓపెన్ చేస్తారు అనగా నేను రాజమౌళి గారికి కాల్ చేసి ఒకసారి కలుద్దాం సర్ అన్నాను. ఏ జోష్ లో షూటింగ్ చేసామో. ఎలా చేసామో నాకు ఆ జోష్ ఇప్పుడు రావట్లేదు సర్, నాకు మోటివేషన్ రావట్లేదు అన్నాను. అపుడు ఆయన చెప్పిన మాట ఇవాళ్టికి నేను గుర్తిపెట్టుకున్నా.

మోటివేషన్ ఏదో ఉంటే రాదు. షూటింగ్ కి ఇంకా టైం ఉంది. ఓ పని చెయ్ చిన్నచిన్నగా మొదలుపెట్టు. ఇవాళ లెగిసి ఏదో ఒక పని పెట్టుకో దాని కోసం పనిచేయి. లాక్ డౌన్ లో ఏం పని ఉంటది. నీ బెడ్ రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలి అనుకో, దాని కోసం పనిచేయి. అలా ఏదో ఒక పని ఇంట్లోనే వెతుక్కొని దాని కోసమే ఆ రోజు నువ్వు మోటివేట్ అవ్వు. గార్డెన్, ఇల్లు, క్లీనింగ్ పనులు చెయ్యి. చిన్న, పెద్ద పనులు ఏదైనా అలాంటివి వెతుక్కొని చెయ్యి అన్నారు. అలా ఆయన చెప్పిన దగ్గర్నుంచి చిన్నగా పనులు మొదలుపెట్టుకొని వాటికోసమే మోటివేట్ అయ్యేవాడ్ని. ఇపుడు పెద్ద పనులు, సినిమాలు, పెద్ది కోసం బాడీ చేంజ్ కోసం మోటివేట్ అవ్వడం మొదలుపెట్టా. అప్పట్నుంచి నేను మళ్ళీ ఏ ఒక్క రోజు కూడా డీ మోటివేట్ అవ్వలేదు. పెద్దిలో హీరో కథ కూడా అదే తనని తాను ఒక కారణం వల్ల మోటివేట్ అయ్యే కథ అని అన్నారు.

Also Read : Bandla Ganesh : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పవర్ స్టార్ తో బండ్లన్న.. వీడియోలు వైరల్..

చరణ్ – బుచ్చిబాబు ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..