Game Changer : మరోసారి చర్చగా మారిన ‘జరగండి’ సాంగ్ బడ్జెట్.. ఆ ఖర్చు వీడియోలో కనిపిస్తుందా..!

మరోసారి చర్చగా మారిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ 'జరగండి' సాంగ్ బడ్జెట్. ఆ ఖర్చు వీడియోలో కనిపిస్తుందా అనే ప్రశ్నకు..

Ram Charan Game Changer movie song Jaragandi budjet is again came into lime light

Game Changer : రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి హీరోహీరోయిన్స్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతుంది. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటూనే వస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసారు. ఈ సాంగ్ ని గత ఏడాది దీపావళికే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలు వల్ల పోస్టుపోన్ చేసారు.

ఇక రేపు చరణ్ బర్త్ డే గిఫ్టుగా ఈ సాంగ్ ని తీసుకు రాబోతున్నారు. కాగా ఈ సాంగ్ రిలీజ్ ని అనౌన్స్ చేస్తూ గతంలో, ఇప్పుడు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రంగురంగు భవనాలు కనిపిస్తున్నాయి. ఆ భవనాలు అన్ని సెట్ అని, కానీ సాంగ్ లో చూడడానికి నిజమైన ఇల్లులా, ఒరిజినల్ లొకేషన్స్ లో తీసినట్లు కనిపిస్తుందని గతంలోనే వార్తలు వినిపించాయి. ఇక ఈ సెట్ నిర్మించడం కోసం శంకర్.. ఏకంగా రూ.16 కోట్లు ఖర్చు చేశారని ఫిలిం నగర్ లో కామెంట్స్ వినిపించాయి.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా మూవీ కాదా..? కేవలం ఆ భాషల్లోనే రిలీజ్..

ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అయితే శంకర్ గురించి తెలిసినవారు.. ఇది చాలా మాములు విషయమే అని లైట్ తీసుకున్నారు. కాగా ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుండడంతో.. మరోసారి ఈ సాంగ్ బడ్జెట్ చర్చల్లోకి వచ్చింది. “స్క్రీన్ పై ఆ ఖర్చు కనిపిస్తుందా లేదా వృధా అవుతుందా” అంటూ పలువురు ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కామెంట్స్ ఏంటంటే.. ఆ ఖర్చు తగ్గ విజువల్స్ స్క్రీన్ పై కనిపిస్తాయని చెబుతున్నారు.

కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సాంగ్ కి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రభుదేవా, శంకర్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ లాంటి డాన్సర్ కూడా తోడు అవ్వడంతో.. ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి రేపు రిలీజ్ కాబోయే లిరికల్ సాంగ్ లో ఎలాంటి స్టెప్స్ ని చూపిస్తారో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు