×
Ad

Game Changer Song : గేమ్ ఛేంజర్ ‘అన్‌ప్రెడిక్టబుల్..’ సాంగ్ రిలీజ్.. స్టైలిష్ గా ఉందిగా.. విన్నారా?

తాజాగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే అన్‌ప్రెడిక్టబుల్.. సాంగ్ రిలీజ్ చేసారు.

  • Published On : January 9, 2025 / 03:02 PM IST

Ram Charan Game Changer Unpredictable Song Released

Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, ఆరు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే అన్‌ప్రెడిక్టబుల్.. సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఈ సాంగ్ చాలా స్టైలిష్ గా ఉంది. సినిమాలో హీరో ఎలివేషన్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వాడతారని తెలుస్తుంది. ఈ పాటను అద్వితీయ, బ్లేజ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, బ్లేజ్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Also Read : OG Glimpse : ప‌వ‌న్ అభిమానుల‌కు సంక్రాంతి ట్రీట్‌..! ఓజీ గ్లింప్స్ రెడీ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కింది. అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చరణ్ మూడు రోల్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై మూవీ యూనిట్ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఫ్యాన్స్ అంతా రేపు సినిమా చూడటానికి సిద్దమయిపోయారు.