చెర్రీకి జపాన్ నుండి సర్‌ప్రైజ్

మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా, జపాన్‌లోని ఆయన అభిమానులు మగధీర సినిమాలోని చరణ్ క్యెరెక్టర్స్‌కి సంబంధించిన రకరకాల ఇమేజెస్‌ని గ్రీటింగ్ కార్డ్స్‌పై ప్రింట్ చేసి, పోస్ట్ ద్వారా చెర్రీకి పంపించారు.

  • Publish Date - April 23, 2019 / 08:27 AM IST

మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా, జపాన్‌లోని ఆయన అభిమానులు మగధీర సినిమాలోని చరణ్ క్యెరెక్టర్స్‌కి సంబంధించిన రకరకాల ఇమేజెస్‌ని గ్రీటింగ్ కార్డ్స్‌పై ప్రింట్ చేసి, పోస్ట్ ద్వారా చెర్రీకి పంపించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అభిమానుల నుండి సర్‌ప్రైజ్ అందుకున్నాడు. అదికూడా జపాన్ ఫ్యాన్స్ నుండి కావడం విశేషం. అసలు ఏం జరిగిందంటే.. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా, జపాన్‌లోని ఆయన అభిమానులు మగధీర సినిమాలోని చరణ్ క్యెరెక్టర్స్‌కి సంబంధించిన రకరకాల ఇమేజెస్‌ని గ్రీటింగ్ కార్డ్స్‌పై ప్రింట్ చేసి, పోస్ట్ ద్వారా చెర్రీకి పంపించారు. దాదాపు 50 మంది అభిమానులు ఇలా గ్రీటింగ్స్ పంపారు. మగధీర జపాన్‌లో రిలీజ్ అయ్యి, అక్కడ కూడా హిట్ అయ్యింది.

అంతదూరం నుండి ఫ్యాన్స్ గ్రీటింగ్స్ పంపడంతో చరణ్ చాలా ఆశ్చ్యర్యంగా ఫీలవుతూ, వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ, జపాన్ నుండి స్వీట్ సర్‌ప్రైజ్ అందింది.. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతగానో సంతోష పరిచాయి. జపాన్ ఫ్యాన్స్ అందరికీ నా ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను.. థ్యాంక్యూ జపాన్.. అంటూ ఆ గ్రీటింగ్ కార్డ్స్‌ను పోస్ట్ చేసాడు చరణ్.

వాచ్, బంగారు కోడిపెట్ట సాంగ్..