Ram Charan : వాళ్ళ కోసం 40 లక్షల విరాళం ఇచ్చిన రామ్ చరణ్.. 18 లక్షలు ఇచ్చిన జానీ మాస్టర్..
ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత దీనిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.(Ram Charan)
- Saketh U
- Published on- July 13, 2026 / 06:27 PM IST
Ram Charan
Ram Charan : తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం రసాభాసాగా మారింది. ఆ మీటింగ్ నుంచి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి. ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత దీనిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో జానీ మాస్టర్ డ్యాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, చరణ్ చేసిన హెల్ప్ గురించి తెలిపారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. మేము ఏం చేయడం లేదు అని మాటలు అన్నారు. నేను ఈ మధ్య పెద్ది సినిమాకే పని చేశాను. మిగతా ఏ పాటలు కూడా చేయలేదు. మన డ్యాన్సర్స్‌ల కష్టాలు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ సార్ తో మాట్లాడాను. ఆయన నలభై లక్షల రూపాయలు ఇచ్చారు. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే 58 లక్షల ఖర్చు అవుతుంది.
మిగతా 18 లక్షల గురించి చాలా మంది మాస్టర్‌లను అడిగాను కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా అని నేను వారిని తప్పు పట్టను. మొన్నే నాకు పెద్ది సినిమా టీం నుంచి పేమెంట్ వచ్చింది. నాకు వచ్చిన 18 లక్షల చెక్ పేమెంట్‌లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంతా కూడా డ్యాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఇస్తున్నాను అని తెలిపారు.
