అశోక్ గల్లా సినిమాకు అతిథిగా రామ్ చరణ్

గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు..

  • Publish Date - November 9, 2019 / 10:30 AM IST

గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతిల కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఈ నెల 10వ తేది ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరుగనుంది.

Read Also : స్టైలిష్ లుక్‌లో బాలయ్య!

‘భలే మంచి రోజు’, ‘శమంతక మణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్‌ని ఎంపిక చేశారు.. సంగీతం : జిబ్రాన్, కెమెరా : రిచర్డ్ ప్రసాద్.