RC 16 Pooja Ceremony : RC 16 మొదలు.. పక్కపక్కనే చరణ్, జాన్వీ.. వైరల్ అవుతున్న వీడియోలు..

జగదేకవీరుడు కొడుకు, అతిలోక సుందరి కూతుర్ని పక్కపక్కనే చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan Janhvi Kapoor RC 16 Movie Started with Pooja Ceremony

RC 16 Pooja Ceremony : రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్ తో రామ్ చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

నేడు RC16 సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ఉపాసనతో పాటు వచ్చాడు. జాన్వీ కపూర్ కూడా హాజరైంది. సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక చరణ్ పక్కన జాన్వీ కపూర్ కనపడటంతో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అధికారికంగా ఈ కార్యక్రమం లైవ్ ఇవ్వలేదు. ఫోటోలు కూడా ఇంకా రిలీజ్ చేయకపోయినా అభిమానుల దగ్గర్నుంచి వీడియోలు లీక్ అవుతున్నాయి.

Also Read : Game Changer : వామ్మో ఏకంగా అన్ని కోట్లా.. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. భారీ ధరకు కొనుగోలు చేసిన అమెజాన్..?

జగదేకవీరుడు కొడుకు, అతిలోక సుందరి కూతుర్ని పక్కపక్కనే చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని భారీగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రహమాన్ సంగీతం ఇవ్వనున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా ‘పెద్ది’ అనే టైటిల్ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. పూజా కార్యక్రమాలు అయినా గేమ్ ఛేంజర్ షూట్ మొత్తం పూర్తయ్యాకే RC16 షూట్ మొదలుపెడతారని బుచ్చిబాబు గతంలో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు