Game Changer : వామ్మో ఏకంగా అన్ని కోట్లా.. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. భారీ ధరకు కొనుగోలు చేసిన అమెజాన్..?

గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.

Game Changer : వామ్మో ఏకంగా అన్ని కోట్లా.. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. భారీ ధరకు కొనుగోలు చేసిన అమెజాన్..?

Game Changer Movie Digital Rights Sold for Amazon Prime With Huge Budget

Updated On : March 20, 2024 / 10:54 AM IST

Game Changer : రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో మూడేళ్ళ క్రితం సినిమా ప్రకటించినా ఇప్పటికి దాని నుంచి సరైన అప్డేట్ ఇవ్వట్లేదు. త్వరలో చరణ్ పుట్టిన రోజుకి ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేస్తారని తమన్ తెలిపాడు. దీంతో అభిమానులు ఆ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిన్నటి వరకు వైజాగ్ లో షూట్ జరగడంతో కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ అయ్యాయి. ఇక నిన్న ముంబైలో జరిగిన అమెజాన్ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.

Also Read : Game changer : ‘గేమ్ ఛేంజర్’ కథ ఇదేనా? లీక్ చేసిన అమెజాన్.. IAS ఆఫీసర్ వర్సెస్ అవినీతి..

అయితే అమెజాన్ గేమ్ ఛేంజర్ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ ని ఏకంగా 110 కోట్లకు కొన్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో మరీ ఇంత భారీ రేటుకు కొన్నారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 110 కోట్లకు డిజిటల్ రైట్స్ అంటే అది చాలా ఎక్కువ మొత్తం. బడ్జెట్ లో కూడా సగం రిలీజ్ అవ్వకుండా వచ్చేసినట్టే.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఓ IAS ఆఫీసర్ కి, అవినీతి రాజకీయనాయకులకు మధ్య జరిగే కథ అని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు కానీ సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజయ్యే అవకాశం ఉంది.