RRR : జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ టీం.. చరణ్ వీడియోతో.. కానీ ఎన్టీఆర్..!

ఆర్ఆర్ఆర్ మూవీ టీం జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, రామ్ చరణ్ కనిపించారు.

RRR : వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ ఇంకా పోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ సినిమా గురించిన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రం పలు క్యాటగిరీలో నేషనల్ అవార్డులను అందుకోవడం, అమెరికన్ అంబాసడర్ ‘ఎరిక్ గర్చేట్టి’ RRR గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేయడం.. ఇలాంటివన్నీ కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ టీం జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, రామ్ చరణ్ కనిపించారు.

అక్టోబర్ 21 రాత్రి ఇండియాలోని జర్మన్ అంబాసడర్స్ మధ్య జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి కీరవాణి హాజరుకాగా, రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా అందర్నీ పలకరించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పిక్స్ ని జర్మన్ ఇండియా తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఈ కార్యక్రమంలో కీరవాణి వేదిక పై జర్మన్ లాంగ్వేజ్ లో పాట పాడి అందర్నీ ఉత్సాహపరిచాడు. ఆ తరువాత జర్మన్ అంబాసడర్స్ అంతా కలిసి నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసి అదరగొట్టారు.

Also read : Dhanraj : దర్శకుడిగా మారుతున్న మరో జబర్దస్త్ కమెడియన్.. ఫస్ట్ మూవీనే బై లింగువల్..!

ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఈవెంట్ కి రాజమౌళి, ఎన్టీఆర్ హాజరుకాలేదని తెలుస్తుంది. కాగా నిన్న నైట్ మైత్రీ మూవీ మేకర్ నేషనల్ అవార్డు విన్నర్స్ కి ఒక పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీరవాణి కనిపించకపోవడంతో.. ఆయన ఎందుకు రాలేదని సందేహాలు కొందరికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పోస్టుతో ఆ డౌట్స్ కి ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఈ ఈవెంట్ లో పాల్గొనడం వలనే కీరవాణి ఆ పార్టీకి రాలేకపోయాడని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు