Ram Charan : G20 సమ్మిట్‌లో రామ్ చరణ్ ‘నాటు నాటు’ స్టెప్.. వీడియో వైరల్!
కాశ్మీర్ లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్.. కొరియన్ అంబాసడర్స్ తో కలిసి స్టేజి పై నాటు నాటుకి స్టెప్పులు వేశాడు. ఆ వీడియోని ఎంబసీ..
- gum 95921
- Published On : May 22, 2023 / 06:33 PM IST
Ram Charan Naatu Naatu step with Singapore Representatives at G20 Summit
Ram Charan : RRR తరువాత టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాల్గొనే పాల్గొంటూ అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా కశ్మీర్ – శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న 2023 G20 సదస్సు లో చరణ్ పాల్గొన్నాడు. నేటి (మే 22) నుంచి మొదలైన ఈ సదస్సు మూడు రోజులు పాటు జరగనుంది. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ప్రతినిధులు.. ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Ram Charan : 2016లో ఇదే ఆడిటోరియంలో సినిమా షూట్ చేశాం.. ఇప్పుడు సమ్మిట్‌లో పాల్గొన్నా.. రామ్‍చరణ్!
ఇక సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. సినిమా అభివృద్ధి, కాశ్మీర్ సినిమా రంగంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అన్న అంశాలు పై మాట్లాడాడు. అనంతరం స్టేజి పై సమ్మిట్ లో పాల్గొన్న కొరియన్ అంబాసడర్స్ తో కలిసి వరల్డ్ ఫేమస్ సాంగ్ నాటు నాటు (Naatu Naatu) కి స్టెప్పులు వేశాడు. అందుకు సంబంధించిన వీడియోని.. ఎంబసీ ప్రతినిధులు తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అలాంటి సదస్సులో రామ్ చరణ్ కూడా భాగం అవ్వడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా రామ్ చరణ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి చరణ్ రానున్న రోజుల్లో ఇంకెన్ని గౌరవాలు అందుకుంటాడా చూడాలి.
Wow ! What a way to start the first session of 3rd Working Grp of Tourism. #RRRMovie. @AlwaysRamCharan. #NaatuNaatu. Dance Off! HC Wong@g20org @JandKTourism @srinagaradmin #G20Kashmir #RamCharan pic.twitter.com/NtAOVvw2AL
— Singapore in India (@SGinIndia) May 22, 2023
