Ram Charan Peddi movie postpone after Ustaad Bhagat Singh release date announce
Ram Charan-Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తరువాత పవన్, హరీశ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD 🕺🤟🏻🙇🏻💥💥
This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN 🔥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan… pic.twitter.com/XjcuIv64wh
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 4, 2026
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ.. చీరలో ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం మార్చి 27 విడుదల కావాల్సి ఉంది. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించారు. ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. అయితే.. చిత్రాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు.
30-04-2026 💥#PEDDI
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ది సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో తెలిపాడు. దీంతో బాబయ్ పవన్ చిత్రం కోసమే చరణ్ తన సినిమాను వాయిదా వేశాడని ఫిల్మ్‌నగర్ టాక్ నడుస్తోంది.