Peddi: ‘పెద్ది’ ప్రభంజనం షురూ.. అరగంటలోనే బాక్సాఫీస్ షేక్.. ఇది కదా చరణ్ రేంజ్

ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రామ్ చరణ్ పెద్ది(Peddi) మూవీ.

Ram Charan peddi Movie Set new Records in Overseas Advance Booking

  • ఓవర్సీస్‌లో ‘పెద్ది’ బుకింగ్స్ ప్రభంజనం.
  • అరగంటలో యాభై వేల డాలర్లు.
  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్.

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని అప్పుడే మొదలుపెట్టేసింది. విడుదలకు ముందే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా అమెరికా వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, కేవలం అరగంటలోనే 50 వేల డాలర్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ మేనియా ఈ స్థాయిలో ఉండటంతో, సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Vaazha 2 OTT: ఓటీటీలో రూ.200 కోట్ల మూవీ.. ‘వాలా 2’ స్ట్రీమింగ్ కి వచ్చేసింది?

గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండటంతో అటు హిందీ బెల్ట్‌లో కూడా మంచి బజ్ నెలకొంది. వీరిద్దరి కెమిస్ట్రీతో పాటు రామ్ చరణ్ మాస్ అప్పియరెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో విశేషం. ఆయన అందించే నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే, విడుదల రోజే ‘పెద్ది(Peddi)’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. దీంతో, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.