Vaazha 2 OTT: ఓటీటీలో రూ.200 కోట్ల మూవీ.. ‘వాలా 2’ స్ట్రీమింగ్ కి వచ్చేసింది?
తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్దమైన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ వాలా 2(Vaazha 2) మూవీ.
vaazha 2 movie ott jio hotstar streaming details
- ‘వాలా 2’ ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.
- జియో హాట్ స్టార్‌లో ఐదు భాషల్లో.
- యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్.
Vaazha 2 OTT: మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో చిన్న చిత్రం ‘వాలా 2(Vaazha 2 OTT)’. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఏకంగా పెద్ద సినిమాల రికార్డులను సైతం సవాల్ చేస్తోంది. దర్శకుడు సావిన్ ఎస్ ఏ సరికొత్త నటీనటులతో రూపొందించిన ఈ సీక్వెల్, మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. నిర్మాత సాహు గారపాటి తెలుగులో విడుదల చేయగా, ఇక్కడి యువత నుంచి కూడా విశేష స్పందన లభించింది. స్నేహం, భావోద్వేగాల చుట్టూ తిరిగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Spirit: గుండుతో ప్రభాస్.. స్పిరిట్ షూటింగ్ పిక్ లీక్.. లుక్ నెక్స్ట్ ఎవళ్ళో ఉందిగా!
ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ ప్రియులను పలకరించేందుకు ఓటిటిలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కైవసం చేసుకోగా, నేటి నుండి తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్ వంటి యంగ్ టాలెంట్ అద్భుత నటనతో అలరించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంటి వద్దే అసలైన వినోదాన్ని పొందేందుకు ‘వాలా 2’ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
