Peddi : హమ్మయ్య.. చిరు మీటింగ్ తో పెద్ది ఇష్యూ ముగిసినట్టేనా.. రిలీజ్ ఆ పద్దతిలోనే..
ఈ మీటింగ్ అనంతరం పెద్ది రిలీజ్ సమస్యకు ఓ పరిష్కారం వచ్చినట్టు తెలుస్తుంది. (Peddi)
- Saketh U
- Published on- May 27, 2026 / 06:39 PM IST
Peddi
Peddi : గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య పర్సెంటేజ్ విధానం – రెంటల్ విధానం అంటూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎగ్జిబిటర్లు తమకు పర్సెంటేజ్ విధానమే కావాలి అంటే నిర్మాతలేమో రెంటల్ విధానంలోనే రిలీజ్ చేస్తామని అంటున్నారు. రాబోయే పెద్ది సినిమాకు కూడా పర్సెంటేజ్ విధానంలో అయితేనే రిలీజ్ చేస్తామని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేయడంతో ఇది పెద్ద సమస్యగా మారింది.
నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ కూడా ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చిరంజీవి రంగంలోకి దిగారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ఎగ్జిబిటర్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తాజాగా నేడు మరోసారి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఎగ్జిబిటర్స్. ఈ మీటింగ్ అనంతరం పెద్ది రిలీజ్ సమస్యకు ఓ పరిష్కారం వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : Chiranjeevi : ‘పెద్ది’ ఇష్యూ.. మరోసారి మెగాస్టార్ తో ఎగ్జిబిటర్స్ భేటీ..
మీటింగ్ సారాంశం ప్రకారం.. ప్రస్తుతానికి సినీ పరిశ్రమలో పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ నిర్ణయం వాయిదా పడింది. పెద్ది సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఒప్పుకున్నట్టు సమాచారం. జూన్ 30 తర్వాత మాత్రం అప్పుడు విడుదలయ్యే సినిమాలకు కచ్చితంగా పర్సంటేజీ విధానం వర్తింపచేయాలని అడిగినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు కూడా నడుచుకోవాలని సూచించారు.
దీంతో ప్రస్తుతానికి తెలంగాణలో పెద్ది రిలీజ్ కి ఎలాంటి సమస్య లేదని తెలుస్తుంది. పెద్ది రిలీజ్ రెంటల్ విధానంలోనే రిలీజ్ అవుతుందని సమాచారం. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ థియేటర్స్ సమస్య చిరు జోక్యంతో పరిష్కారమైందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
