చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటంటే?

  • Publish Date - February 11, 2020 / 12:23 PM IST

సైరా మీడియా మీట్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటించనున్నట్లు కాస్త క్లూ ఇచ్చారు చిరంజీవి. అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొరటాలతో సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఇప్పటికే తెలిసిపోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కాల్షీట్లు కూడా చరణ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో రామ్ చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో మెరిశాడు చిరంజీవి అయితే ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించలేదు. అయితే లేటెస్ట్‌గా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొరటాలతో సినిమాలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించబోతున్నారట.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో 40 నిమిషాలు ఉండే పాత్రను చేస్తున్నారట రామ్ చరణ్. ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు లీకయ్యింది. చరణ్ ఇందులో నక్స‌లైట్‌గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందుకోసం 30రోజుల కాల్షీట్ కూడా రామ్ చరణ్ ఇచ్చేశాడట.  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మే నుంచి కొరటాల సినిమాలో నటించబోతున్నారట.

సందేశాత్మక సినిమాలు తీసే కొరటాల ఈ సినిమాలో కూడా ఓ సోషల్ ఎలిమెంట్ ఎంచుకుని చిరంజీవిని చూపించబోతున్నాడట. భూముల కుంభకోణం గురించి పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో చిరంజీవి ఎండోమెంట్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.