RC16 : రామ్‌చరణ్ సినిమాలో ఆమె హీరోయిన్.. కన్ఫార్మ్ చేసిన తండ్రి..

RC16లో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హీరోయిన్ తండ్రే సమాచారం ఇచ్చారు.

Ram Charan RC16 Heroine update video gone viral

RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. సినిమాలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసేందుకు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక అలాగే రామ్ చరణ్ కి జంటగా కనిపించేందుకు ఆ భామని ఎంపిక చేశారని పలు పేర్లు వినిపించాయి. మొదటిలో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని పేరు, ఆ తరువాత సాయి పల్లవి, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హీరోయిన్ తండ్రే సమాచారం ఇచ్చారు.

Also read : Jani Master : జానీ మాస్టర్‌కి కీలక పదవిని అప్పగించిన.. జనసేనాని పవన్ కళ్యాణ్..

బాలీవుడ్ భామ జాన్వీ కపూరే ఈ సినిమాలో హీరోయిన్ గా చేయబోతుందట. ఆమె తండ్రి బోణి కపూర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసారు. దీంతో RC16లో జాన్వీ హీరోయిన్ అని అఫీషియల్ కన్ఫార్మేషన్ వచ్చేసింది. కాగా చరణ్ తండ్రి చిరంజీవి, జాన్వీ తల్లి శ్రీదేవి.. ఆన్‌స్క్రీన్ పై హిట్ పెయిర్ అనిపించుకున్నారు. మరి ఇప్పుడు ఈ జంట ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో సాగనుందట. ఇక మూవీ నేపథ్యం వచ్చేపాటికి.. స్పోర్ట్స్ కథతో రూపొందబోతుందని సమాచారం. ఈ మూవీ పై రామ్ చరణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తుంటే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు