Ram Charan : వామ్మో.. కోటి రూపాయల వాచ్.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ వాచ్.. అసలు ధర ఎంతో తెలుసా?

తాజాగా రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ బాగా వైరల్ అయింది. ఇటీవల రామ్ చరణ్ కి పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాపని, ఉపాసనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో చరణ్ వచ్చి దగ్గరుండి తీసుకెళ్లాడు.

  • Updated on- June 30, 2023 / 04:17 PM IST

Ram Charan Richard Mille Watch goes viral cost near to one crore rupees

Ram Charan Watch :  సాధారణంగా సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి అభిమానులు, జనాలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. ఇక సెలబ్రిటీలు వేసే బట్టలు, వాడే కార్లు, తినే తిండి, పెట్టుకునే వాచ్ లు, షూస్.. వీటిపై మరింత ఫోకస్ చేస్తారు. వాటి రేట్లు తెలుసుకోవాలని, అవి ఎక్కడ దొరుకుతాయని చెక్ చేస్తారు. ఇక సెలబ్రిటీలు వాడే వస్తువుల ధరలు భారీగానే ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న వాటికి కూడా బ్రాండ్ వి కొనుక్కొని లక్షల్లో ఖర్చు పెడతారు.

ముఖ్యంగా స్టార్ హీరోలు వేసే డ్రెస్సులు, వాచ్ లు, షూస్ పై అభిమానులు బాగా ఫోకస్ చేస్తారు. తాజాగా రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ బాగా వైరల్ అయింది. ఇటీవల రామ్ చరణ్ కి పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాపని, ఉపాసనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో చరణ్ వచ్చి దగ్గరుండి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ బయట ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పాడు.

Om Raut : ఆదిపురుష్ 2 చేద్దామన్న ఓం రౌత్.. నో చెప్పిన ప్రభాస్ నిజమేనా??

అయితే ఆ రోజు చరణ్ పెట్టుకున్న వాచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందినది. రిచర్డ్ మిల్లె కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లను ఉత్పత్తి చేసే సంస్థ. ఈ కంపెనీకి చెందిన ఓ వాచ్ ని చరణ్ పెట్టుకున్నాడు. ఆ వాచ్ ధర దాదాపు 2 లక్షల డాలర్లు ఉంటుందని సమాచారం. అంటే మన కరెన్సీలో దాదాపు కోటి 40 లక్షలకు పైగానే ఉంది. దీంతో ఒక్క వాచ్ ధర కోటి రూపాయల పైనే అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.