Om Raut : ఆదిపురుష్ 2 చేద్దామన్న ఓం రౌత్.. నో చెప్పిన ప్రభాస్ నిజమేనా??

దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు, ట్రోల్స్ వస్తున్న సమయంలో తాజాగా ఓ వార్త ఆసక్తికరంగా మారింది.

Om Raut : ఆదిపురుష్ 2 చేద్దామన్న ఓం రౌత్.. నో చెప్పిన ప్రభాస్ నిజమేనా??

Om Raut asks Prabhas for Adipurush 2 Movie Prabhas said No

Adipurush :  ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్. సినిమా రిలీజ్ రోజు నుంచి దారుణమైన విమర్శలు ఎదుర్కొంటుంది ఈ సినిమా. ఇక డైరెక్టర్ ఓం రౌత్ ని అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా రామాయణంలా అనిపించకపోవడం, క్యారెక్టర్స్ డిజైన్ ఇష్టమొచ్చినట్టు పెట్టడం, కొత్త కొత్తగా ఫైట్స్ పెట్టడం రామాయణంలో, కొన్ని డైలాగ్స్, చూపించిన లొకేషన్స్, గ్రాఫిక్స్.. ఇలా అన్నిటిమీద విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలు చాలవన్నట్టు ముందునుంచి రామాయణం అని ప్రమోట్ చేసి.. సినిమా రైటర్ అసలు మేము చేసింది రామాయణం కాదనడం, ఆ తర్వాత హనుమంతుడు దేవుడు కాదు అనడం.. ఇలా పలు వ్యాఖ్యలు చేసి సినిమాని మరింత వివాదంలో ముంచాడు. సినిమా వివాదాల్లో ఉండటంతో మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇలా దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు, ట్రోల్స్ వస్తున్న సమయంలో తాజాగా ఓ వార్త ఆసక్తికరంగా మారింది.

Devara : ‘దేవర’పై అదిరిపోయే అప్డేట్.. ఆ ఫైట్ షూటింగ్ అయిపోయింది..

ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని ఆదిపురుష్ 2 చేద్దామని అడిగాడట. రామాయణంలోని మరిన్ని సన్నివేశాలను తీసుకొని పార్ట్ 2 చేద్దామని అడగగా ప్రభాస్ నో చెప్పినట్టు సమాచారం. అయితే ఇది సినిమా రిలిజ్ కి ముందు అడిగాడా లేక రిలీజ్ తర్వాత అడిగాడా అనేది తెలీదు. ఈ విషయం తెలిసి మరోసారి ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు ఓం రౌత్ పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై ఓ సినిమా PRO ట్వీట్ చేయడం విశేషం.