‘ఆచార్య’లో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌‌గా చరణ్..

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ చిరంజీవి..

  • Publish Date - March 25, 2020 / 09:52 AM IST

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న క్యారెక్టర్ గురించి ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిద‌ెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ లేదా మ‌రెవ‌రైనా ప్ర‌ముఖ హీరో న‌టించనున్నారని ముందు నుంచి వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మెగాస్టార్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తెరపంచుకోవడం ఖాయమైపోయిందన్నారు. కట్ చేస్తే చెర్రీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందట. మెగా పవర్ స్టార్ ఈ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడని దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందని తెలుస్తోంది. చెర్రీ సరసన ఓ యువ కథానాయిక నటించనుందని, చిరు, చరణ్ ఓ పాటలో కలిసి కనిపించనున్నారని సమాచారం.

Read Also : ‘మనంసైతం’కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు