Ram Charan : ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోము.. వాల్తేరు వీరయ్య స్టేజిపై రామ్ చరణ్ వార్నింగ్..
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఆయన సైలెంట్ గా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు అని అంతా అంటారు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారు. అదే ఆయన కొద్దిగా తెగించి మాట్లాడితే..................
- Saketh U
- Published On : January 29, 2023 / 07:00 AM IST
Ram Charan serious warning to who trolls chiranjeevi
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ప్రాఫిట్స్ తో అదరగొడుతుంది. విదేశాల్లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ అయినందుకు కొన్ని రోజుల క్రితం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా వచ్చాడు. ఇక అక్కడి ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమా పెద్ద హిట్ చేసినందుకు, వింటేజ్ చిరంజీవిని చూపించినందుకు డైరెక్టర్ కి, అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు.
అలాగే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఆయన సైలెంట్ గా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు అని అంతా అంటారు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారు. అదే ఆయన కొద్దిగా తెగించి మాట్లాడితే ఎంతమంది వస్తారు. ఆయనని అనేవాళ్ళకి ఇది తెలీదు. ఆయన్ని ఏమన్నా అంటే ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ మాత్రమే అనాలి. ఆయన సైలెంట్ గా ఉంటాడేమో ఆయన్ని అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆయన వెనకాల మేము సైలెంట్ గా ఉండము. ఆయనని అంటే మేము ఊరుకోము సైలెంట్ గానే చెప్తున్నాం, మేము సైలెంట్ గా ఉండము అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు చిరంజీవిపై, మెగా ఫ్యామిలీ అంటూ కొంతమంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి విమర్శలు చేసిన వాళ్లకి వాల్తేరు వీరయ్య స్టేజిపై నుంచే రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
