×
Ad

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అనౌన్స్ చేసి మూడేళ్లు.. ఒక్క టైటిల్ ఫోటో తప్ప ఏం లేదు.. పాపం చరణ్ ఫ్యాన్స్..

గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసి నేటికి మూడేళ్లు అవుతుంది.

  • Published On : February 12, 2024 / 11:13 AM IST

Ram Charan Shankar Game Changer Movie announcement Completed Three Years still no updates fans worrying

Game Changer : RRR తర్వాత రామ్ చరణ్(Ram Charan) పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు పెరిగాయి. RRR తర్వాత ఆచార్య సినిమాలో కనిపించినా ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. 2021 ఫిబ్రవరి 12న రామ్ చరణ్ – తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో భారీగా సినిమాని ప్రకటించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కాస్ట్ తో RC15గా ఈ సినిమాని అనౌన్స్ చేశారు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసి నేటికి మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటిదాకా షూటింగ్ పూర్తవ్వలేదు. సినిమా నుంచి ఒక్క గేమ్ ఛేంజర్ అనే టైటిల్ పోస్టర్ తప్ప, గ్లింప్స్ కానీ, ఇంకెలాంటి అప్డేట్స్ కానీ రాలేదు. సినిమా షూటింగ్ నుంచి మాత్రం అప్పుడప్పుడు చరణ్ ఫోటోలు లీక్ అయి వైరల్ అయ్యాయి. ఈ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ చాలా నిరాశ వ్యక్తపరుస్తున్నారు.

Also Read : Actor Nandu : స్టేజిపై ఏడ్చేసిన నందు.. నాకు సంబంధం లేకపోయినా నా గురించి వార్తల్లో అలా..

ఇప్పటికే పలుమార్లు చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వమంటూ డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుని టార్గెట్ చేసి పోస్టులు కూడా చేశారు. కానీ చిత్రయూనిట్ మాత్రం అస్సలు స్పందించట్లేదు. గతంలో ఓ సాంగ్ లీక్ అవ్వగా అధికారికంగా ఆ పాట రిలీజ్ చేస్తామని ప్రకటించి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. కొన్ని సార్లు చరణ్ ఫ్యాన్స్ చిత్రయూనిట్ పై సీరియస్ అయి విమర్శలు కూడా చేశారు. ఇక శంకర్ – చరణ్ కాంబోలో సినిమా ప్రకటించి నేటికి మూడేళ్లు అవుతుండటంతో గేమ్ ఛేంజర్ మరోసారి వైరల్ గా మారింది. మూడేళ్లు అయినా ఎలాంటి అప్డేట్ లేకపోవడం, సినిమా షూట్ పూర్తికాకపోవడంపై అభిమానులు మరోసారి చిత్రయూనిట్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో కానీ, దసరాకు కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇటీవల దిల్ రాజు ఓ మీడియాతో తెలిపారు.