Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఇంకో సంవత్సరానికి వాయిదా? ఆ పండక్కి రిలీజ్? నిరాశలో చరణ్ అభిమానులు..
ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది అవ్వదని అందరికి క్లారిటీ వచ్చేసింది.
- Saketh U
- Updated on- November 23, 2023 / 09:15 AM IST
Ram Charan Shankar Game Changer Movie Update
Game Changer Movie : రామ చరణ్(Ram Charan) అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో చాలా నిరాశలో ఉన్నారు. RRR సినిమా తర్వాత చరణ్ ఆచార్య సినిమాలో కనిపించాడు. ఆ సినిమా పరాజయం పాలయింది. దీంతో చరణ్ నెక్స్ట్ సినిమాపై అంతా ఆశలు పెట్టుకున్నారు. చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటిదాకా సినిమా టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు.
సినిమా నుంచి ఒక పాట లీక్ అవ్వగా.. మళ్ళీ అది వాళ్ళే రిలీజ్ చేస్తామని దీపావళికి ప్రకటించి అది కూడా వాయిదా వేశారు. చరణ్ కి కూతురు పుట్టడం, శంకర్ ఇండియన్ 2 షూటింగ్ కోసంవెళ్లడంతో షూటింగ్ చాలా రోజులు వాయిదా పడింది. దీంతో మెగా అభిమానులు గేమ్ ఛేంజర్ నిర్మాతలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని సోషల్ మీడియాలో మూవీ యూనిట్ ని తిడుతున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది అవ్వదని అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక సమ్మర్ కి అయినా రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ సమ్మర్ కి కూడా వచ్చేలా లేదు. శంకర్ ఇండియన్ 2 సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని సమాచారం.
తాజా టాలీవుడ్ టాక్ ప్రకారం ఇండియన్ 2 సినిమా పనులన్ని పూర్తయ్యాకే శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాకు వస్తారని, షూటింగ్ మాత్రం మధ్యలో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇండియన్ 2 రిలీజ్ అయ్యాకే చూసుకుంటారని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం దీపావళికి గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే దీపావళి అయింది. మళ్ళీ దీపావళి అంటే ఇంకో సంవత్సరం చరణ్ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా చరణ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, చిత్రయూనిట్ స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
