×
Ad

Ram Charan : స్పెషల్ ఫుడ్ వండించి, టైం కేటాయించి.. పంజాబ్‌లో సోల్జర్స్‌తో చరణ్..

తాజాగా చరణ్ పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద వర్క్ చేసే BSF సోల్జర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ కుక్ ని పిలిపించి సోల్జర్స్ కోసం ఇక్కడి స్పెషల్ వంటలని...........

  • Published On : April 19, 2022 / 08:25 PM IST

Charan

Ram Charan :   ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నార్త్ లో చరణ్, తారక్ లకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చరణ్ ని అల్లూరి సీతారామరాజులా చూపించారు రాజమౌళి. అయితే కొన్ని సీన్స్ లో కాషాయ వస్త్రాల్లో ఉండి బాణాలు పట్టుకోవడంతో రాముడిలా కనపడ్డారంటూ నార్త్ లో ఏకంగా చరణ్ కి పూజలు కూడా చేసేశారు. ఆ సీన్స్ తో చరణ్ కి ఒక్కసారిగా నార్త్ లో అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడు చరణ్ నార్త్ వెళితే ఫోటోల కోసం ఎగబడుతున్నారు అక్కడి జనాలు.

 

ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో షూట్ ని పూర్తి చేసుకొని తాజాగా పంజాబ్ లో షూట్ మొదలుపెట్టారు. RC15 ప్రస్తుతం పంజాబ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక చరణ్ అక్కడ షూట్ చేస్తున్నాడని తెలిసి చుట్టు పక్కల పలు ప్రాంతాల నుంచి చరణ్ తో ఫోటోలు దిగడానికి జనాలు వచ్చారు. చరణ్ కి సెక్యూరిటీ కోసం వచ్చిన పంజాబ్ పోలీసులు కూడా చరణ్ తో ఫోటోల కోసం ప్రయత్నించారు. దీని బట్టి అర్ధమవుతుంది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కి నార్త్ లో ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో.

Shivaraj Singh Chouhan : అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్.. తెలుగు సినిమాపై మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు..

 

ఇక తాజాగా చరణ్ పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద వర్క్ చేసే BSF సోల్జర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ కుక్ ని పిలిపించి సోల్జర్స్ కోసం ఇక్కడి స్పెషల్ వంటలని వండించాడు. ఆ తర్వాత వారికి భోజనాలు వడ్డించి, ఫోటోలు దిగి వారితో కొంత సమయం గడిపారు చరణ్. BSF సోల్జర్స్ కూడా చరణ్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఇక RC15 షూట్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు చరణ్.