Shivaraj Singh Chouhan : అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్.. తెలుగు సినిమాపై మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్ భోపాల్‌లో 'తెలుగు సంగమం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.........

Shivaraj Singh Chouhan : అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్.. తెలుగు సినిమాపై మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు..

Prabhas

 

Telugu cinema :  ఇటీవల తెలుగు సినిమాలు వరుసగా భారీ విజయాలు సాధిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా విడుదలయి మంచి విజయాల్ని సాధిస్తూ కలెక్షన్లని కొల్లగొడుతున్నాయి. దేశం మొత్తం తెలుగు సినిమాలని పొగుడుతున్నాయి. అన్ని భాషల సెలబ్రిటీలు తెలుగు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా తెలుగు సినిమా విజయాల్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా తెలుగు సినిమాల గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఇటీవల మధ్యప్రదేశ్ భోపాల్‌లో ‘తెలుగు సంగమం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యప్రదేశ్ లో నివసిస్తున్న తెలుగు వారంతా తెలుగు సాంస్కృతిక పరిషత్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. ”తెలుగు వారు మా రాష్ట్ర వాసులతో బాగా కలిసిపోయారు. మనం విభిన్న సంస్కృతులను కలిగి ఉన్నా మన ఆత్మ ఒక్కటే, మనమందరం ఒక గొప్ప దేశమైన భారతదేశానికి చెందిన వాళ్ళం” అని అన్నారు.

SV Krishna Reddy : ఎనిమిదేళ్ల తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా.. బిగ్‌బాస్ సోహైల్‌తో ప్రయోగం..

 

ఇక తెలుగు సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ.. ”భారతదేశ సినీ పరిశ్రమలో టాలీవుడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. బాహుబలి సినిమా చూసి మేమంతా ఫిదా అయ్యాం. తెలుగు సినిమా వాళ్ళు దేశంలోని ప్రజలందరికీ సుపరిచితులే. తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ కంటే పెద్దదిగా మారింది. అందుకే బాహుబలి లాంటి సినిమాలను దేశానికి ఇస్తుంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వారిని ప్రపంచం అంతా గుర్తించేలా చేశారు. ఇప్పుడు ప్రభాస్ తెలుగువారిని ప్రపంచం అంతా గుర్తించే విధంగా చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ దేశ సినిమా భవిష్యత్తుకి కొత్త దార్లు తెరుస్తుంది” అని అన్నారు.

Police : గంజాయి సరఫరా కేసులో అరెస్ట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్

ఇలా మన తెలుగు సినిమాల గురించి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ని పొగడటంతో ప్రభాస్ అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సినీ నటుడు అలీ, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎల్‌వి గంగాధర్ శాస్త్రి, గిరిజన జానపద గాయకుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యలను సన్మానించారు.