Police : గంజాయి సరఫరా కేసులో అరెస్ట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్

గంజాయి తరలింపుపై సమాచారం అందడంతో పక్కాగా ప్లాన్ చేసి కర్ణాటక నుంచి కారులో గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్‌........

Police : గంజాయి సరఫరా కేసులో అరెస్ట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్

Police

Ganjayi Tarnsfer :  ఇటీవల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. వరుసగా డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు వీటిపై మరింత దృష్టి సారించారు. తాజాగా గంజాయిని విక్రయిస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలింపుపై సమాచారం అందడంతో పక్కాగా ప్లాన్ చేసి కర్ణాటక నుంచి కారులో గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

 

Rajamouli : అర్ధరాత్రి పూట చార్మినార్ రోడ్ల మీద రాజమౌళి

ఈ గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హాథీరామ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్‌ గంజాయి సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్‌ కొంతకాలంగా కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి, మరికొన్ని సినిమాలకి హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ కేసులో హథిరామ్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.