Rajamouli : అర్ధరాత్రి పూట చార్మినార్ రోడ్ల మీద రాజమౌళి

తాజాగా రాజమౌళి తన కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ వద్ద సందడి చేశారు. సాధారణ వ్య​క్తిలా వెళ్లి రాత్రి పూట చార్మినార్ ని సందర్శించి, అక్కడ నైట్‌ బజార్‌ని............

Rajamouli :  అర్ధరాత్రి పూట చార్మినార్ రోడ్ల మీద రాజమౌళి

Rajamouli

 

Rajamouli :  బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన డైరెక్టర్ రాజమౌళి. పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. ప్రాంతీయ సినిమాలకి పాన్ ఇండియా దారి చూపించారు. రాజమౌళి వల్లే తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తాని చాటారు రాజమౌళి. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దర్శకధీరుడు ఇంత పెద్ద విజయాల్ని సాధించి సింపుల్ గానే ఉంటారు.

Bollywood Exhibitors : సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్ళం..

తాజాగా రాజమౌళి తన కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ వద్ద సందడి చేశారు. సాధారణ వ్య​క్తిలా వెళ్లి రాత్రి పూట చార్మినార్ ని సందర్శించి, అక్కడ నైట్‌ బజార్‌ని తిలకించారు. ఆ తర్వాత అక్కడే ఓ హోటల్‌లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా రాజమౌళితో ఫోటోల కోసం ఎగబడ్డారు. కొంతమంది రాజమౌళితో ఫోటోలు దిగాక అక్కడినుంచి నిష్క్రమించారు. పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యుండి ఇలా సింపుల్ గా సాధారణ వ్యక్తిలా వచ్చి తిరగడం, తినడం చూసి అక్కడ ఉన్న వారితో పాటు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా మొదలుపెట్టనున్నారు.