Site icon 10TV Telugu

Klin Kaara Konidela : రామ్ చరణ్ కూతురి పేరు ‘క్లిం కార కొణిదెల’ (KKK) ఎక్కడ్నుంచి తీసుకున్నారో తెలుసా?

Ram Charan Upasana Daughter Name Klin Kaara Konidela Meaning

Ram Charan Upasana Daughter Name Klin Kaara Konidela Meaning

Ram Charan – Upasana : రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలిలో, అభిమానుల్లో సంతోషం నెలకొంది. ఆల్రెడీ ఒక పేరు అనుకున్ననట్లు, బారసాల రోజు తెలియచేస్తాం అని రామ్ చరణ్ తెలిపారు. నేడు ఆ పాప బారసాల గ్రాండ్ గా జరిగింది.

ఇక ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తమ పాప పేరు ‘క్లిం కార’ అని తెలిపింది. చిరంజీవి కూడా ఈ పేరుని షేర్ చేశారు. అయితే అభిమానులతో పాటు, నెటిజన్లు కూడా ఇదేం వింత పేరు, ఇలా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే RRR లాగా క్లిం కార కొణిదెల KKK అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan – Upasana : రామ్ చరణ్ కూతురి పేరేంటో తెలుసా? ఎంత వెరైటీగా ఉందో చూశారా?

ఈ పేరుని షేర్ చేస్తూ.. ఇది లలితా సహస్రనామం నుంచి తీసుకున్నామని శక్తి, ప్రకృతి అనే అర్ధం అవస్తుందని తెలిపారు. లలితా సహస్రనామంలో 125వ శ్లోకంలో క్లిం కారీ అని ఉంటుంది. దాని నుంచి తీసుకున్నట్టు తెలిపారు. క్లిం కారీ తీసుకొని దాన్ని ‘క్లిం కారా’గా మార్చుకున్నారు. కొంతమంది అభిమానులు, నెటిజన్లు వెరైటీ పేరు అంటూ దీనిపై కామెడీగా కామెంట్స్, ట్రోల్స్ చేస్తుంటే, కొంతమంది మాత్రం అభినందిస్తున్నారు. అంత బాగా లలితాసహస్రనామంని అబ్జర్వ్ చేసి పేరు తీసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version