Upasana Peddi Movie: భర్త సినిమాని ఫ్యాన్స్‌తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఉపాసన.. వీడియోలు వైరల్..

Upasana Peddi: రామ్ చరణ్ భార్య ఉపాసన ఇలా పబ్లిక్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటం అనేది ఇప్పటివరకు జరగలేదు.

  • Updated on- June 4, 2026 / 10:50 AM IST

Ram Charan Wife Upasana Enjoy Peddi Movie With Fans Videos Viral

Upasana Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. నిన్న రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు. అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని నిన్న రాత్రే థియేటర్స్ లో చూసి సందడి చేసారు. ఈ క్రమంలో రామ్ చరణ్ భార్య కూడా థియేటర్ కి వచ్చి పెద్ది సినిమా చూసింది.

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇలా పబ్లిక్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటం అనేది ఇప్పటివరకు జరగలేదు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read – Peddi OTT : ‘పెద్ది’ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?

రామ్ చరణ్ భార్య ఉపాసన నిన్న రాత్రి తన తండ్రి అనిల్ కామినేని, మరికొంతమంది సన్నిహితులతో కలిసి హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ సింగిల్ స్క్రీన్ లో పెద్ది సినిమాని చూసారు. ఫ్యాన్స్ తో కలిసి ఉపాసన కూడా సినిమాని ఎంజాయ్ చేసింది. ఉపాసన కూడా అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ, విజిల్స్ వేస్తూ, స్క్రీన్ పై తన భర్త పర్ఫార్మెన్స్ లో కొన్ని సీన్స్ ని ఫోన్ లో బంధిస్తూ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. చరణ్ భార్య ఇలా థియేటర్ కి వచ్చి సందడి చేయడంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.