Ram Charan Birthday : రామ్ చరణ్‌ను సర్‌ప్రైజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. తారక్ మొదలు న్యూయార్క్ వరకు విషెస్ వెల్లువ..

మార్చి 27 మెగా పవర్‌స్టార్ బర్త్‌డే కాగా ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్.. మార్చి 26న హైదరాబాద్‌లో అభిమానులను కలిసిన చెర్రీ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘వకీల్ సాబ్’ సినిమాల గురించి వారితో ముచ్చటించారు.

Ram Charan Birthday

Ram Charan Birthday : మార్చి 27 మెగా పవర్‌స్టార్ బర్త్‌డే కాగా ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్.. మార్చి 26న హైదరాబాద్‌లో అభిమానులను కలిసిన చెర్రీ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘వకీల్ సాబ్’ సినిమాల గురించి వారితో ముచ్చటించారు.

ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ లో సీతారామరాజు పోస్టర్, ‘ఆచార్య’ లో సిద్ధ క్యారెక్టర్ లుక్ కూడా రిలీజ్ చేసి రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్.. ఇదిలా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చరణ్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ అంటూ ‘బాహుబలి’ లాంటి భారీ క్రేన్‌తో భారీ స్థాయిలో బెలూన్లతో చరణ్‌కి విషెస్ చెప్పారు. ఈ సర్‌ప్రైజ్‌తో చెర్రీ ఆశ్చర్యపోయాడు. రాజమౌళికి థ్యాంక్స్ చెబుతుంటే జక్కన్న ఇది నా ఐడియా కాదు తనది అంటూ కార్తికేయను చూపించగా చరణ్ తనతో పాటు అందరికీ కృతజ్ఞతలు చెప్పి కేక్ కట్ చేశారు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ లో కొమరం భీం గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చరణ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న పిక్ షేర్ చేస్తూ.. ఈ సంవత్సరం తామిద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ విషెస్ చెప్పాడు. ఇక న్యూయార్క్‌ టైమ్ స్క్వేర్‌లోని నాస్డాక్ బిల్డింగ్ పైన చరణ్ సినిమాలతో కూడిన వీడియో ప్లే చేసి విషెస్ చెబుతూ సర్‌ప్రైజ్ చేశారు మెగా ఫ్యాన్స్.