Ram Gopal Varma interesting comments on Rajamouli and his success
Rajamouli : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసేసి ప్రస్తుతం తన ఇష్టం అంటూ ఇష్టమొచ్చిన సినిమాలు తీస్తున్నారు. ఇక సమాజంలోని ఏదో ఒక విషయంపై స్పందిస్తూ అప్పుడప్పుడు ట్విట్టర్(Twitter) లో హడావిడి చేస్తారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం(Vyooham) అనే సినిమాని తీస్తున్నారు.
ఇటీవలే ఆర్జీవీ తన కొత్త ఆఫీస్ డెన్ ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడుతూ రాజమౌళి గురించి, ఆయన సక్సెస్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తిగా స్పందించారు.
Arjun Ambati : సీరియల్ హీరో నుంచి సినిమా హీరోగా మారిన అర్జున్ అంబటి.. ‘పరమపద సోపానం’ టీజర్ విడుదల
ఆర్జీవీ మాట్లాడుతూ.. నాకు జెలసీ లేదు, ఏ డైరెక్టర్ మీద కూడా జెలసీ లేదు. ఎవరి సినిమాలు వాళ్ళ ఇష్టం. నాకు రాజమౌళికి ఉన్నంత ఓపిక లేదు. ఆయన లాగా నేను 500 కోట్లతో సినిమాలు తీయలేను. ఒకవేళ నాకు సినిమా తీయమని 500 కోట్లు ఇచ్చినా నేను 50 కోట్లతో తీస్తాను. అది ఆయన స్టైల్, ఇది నా స్టైల్ అంతే అని అన్నారు. దీంతో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా ఆర్జీవికి ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరూ పలు సార్లు ఆర్జీవిని పొగుడుతూ, ఆర్జీవిపై తమకు ఉన్న ఇష్టాన్ని తెలియచేశారు.