Ram Gopal Varma supports Rajamouli over comments on Hanuman
Rajamouli-RGV: దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఆయన ఇండియన్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు. తాజాగా ఈ దర్శక దిగ్గజం(Rajamouli-RGV) తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. దీంతో, ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.
Ram Gopal Varma: కాస్ట్యూమ్ నచ్చక బీచ్ లో.. ఊర్మిళ చేసిన పనికి యూనిట్ అంతా షాక్.. టీ షర్ట్ కూడా..
ఈ ఈవెంట్ లో రాజమౌళి నోరు జారాడు. హనుమంతుడిపై కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో ఆయనపై దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. హిందుమనోభావాలు దెబ్బతీశాడు అంటూ రాజమౌళిపై కేసులు పెడుతున్నారు, ఆలాగే సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం దాదాపు వారం రోజులుగా నడుస్తున్నా దర్శకుడు రాజమౌళి మాత్రం స్పందించడంలేదు. కనీసం, సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం లేదు. దీంతో, రాజమౌళి సినిమాలను ఇండియాలో బైకాట్ చేయాలంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళికి తన మద్దతు తెలుపుతూ లాజికల్ కామెంట్స్ చేశాడు.
“కొన్ని రోజుల నుంచి రాజమౌళిపై విషం కక్కుతున్నారు కొంతమంది. కానీ,వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓ వ్యక్తి నాస్తికుడిగా ఉండడం తప్పు కాదు. ఆర్టికల్ 25 ప్రకారం దేవుడ్ని నమ్మేవాళ్లు ఎంత బలంగా తమ నమ్మకాన్ని చెబుతున్నారో, అదే ఆర్టికల్ ప్రకారం దేవుడిపై నమ్మనివాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఆ హక్కు రాజమౌళికి కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, గ్యాంగ్ స్టర్ సినిమా చేయాలంటే దర్శకుడు గ్యాంగ్ స్టర్ అవ్వాల్సిన అవసరంలేదు. హారర్ సినిమా చేయాలంటే దెయ్యంగా మారాలా.. అలాగే మైథలాజికల్ మూవీ చేయడానికి దేవుడిని నమ్మాల్సిన పనిలేదు. చాలా మంది దర్శకుల కంటే దేవుడ్ని నమ్మని రాజమౌళికే విజయాలు ఎక్కువ. కాబట్టి దేవుడు రాజమౌళినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు”అంటూ రాసుకొచ్చాడు వర్మ. దీంతో, వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. అలాగే, ఆయన పెట్టిన ఈ పోస్ట్ కింద చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వర్మ రేంజ్ లో లాజిక్స్ తో కొడుతున్నారు.