వామ్మో వర్మ.. ఏంటిది- టూ మిలియన్ వ్యూస్ దాటేసిన ట్రైలర్

మూడు మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తున్న లక్ష్మీ'S ఎన్టీఆర్ ట్రైలర్..

  • Publish Date - February 14, 2019 / 11:39 AM IST

మూడు మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తున్న లక్ష్మీ’S ఎన్టీఆర్ ట్రైలర్..

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ.. లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ.. ట్రైలర్ ఈ ఉదయం రిలీజ్ అయ్యింది. రిలీజ్ చేసిన ఒక గంటకే 5.5 లక్షల వ్యూస్ వచ్చాయి.. గంటన్నరకే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి.. లార్డ్ ఎన్టీఆర్, మా లక్ష్మీ’S ఎన్టీఆర్ టీమ్‌ని బ్లెస్ చేసారు.. అందుకే భారీగా వ్యూస్ వస్తున్నాయి.. అని పోస్ట్ చేసాడు వర్మ.. పబ్లిసిటీ చెయ్యడంలో వర్మని మించినవాళ్ళు ఎవరూ లేరు అనే సంగతి తెలిసిందే.. ఎక్కడెక్కడి ఫోటోలో వెతికి పట్టుకుని మరీ, లక్ష్మీ’S ఎన్టీఆర్‌ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తున్నాడు.. రాహుల్ గాంధీ, వై.ఎస్.జగన్, కెసీఆర్, కెటీఆర్ తదితరులు లక్ష్మీ’S ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్టు.. సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసి, రచ్చ రచ్చ చేస్తున్నాడు…

కేసీఆర్, కేటీఆర్‌తో.. ఈనీ గురించి నీకు ముందుగాలే జెప్పినా కదరా అంటున్నట్టు తన క్రియేటివిటీతో పోస్ట్‌లు చేస్తున్నాడు.. ట్రైలర్.. ఇప్పటికే రెండు మిలియన్ వ్యూస్ దాటేసి, మూడు మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది.. లక్ష్మీ’S ఎన్టీఆర్ ట్రైలర్‌పై, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో అనేది హాట్ టాపిక్‌గా మారింది..

వాచ్ ట్రైలర్…