×
Ad

Skanda Collections : ఫస్ట్ వీక్‌లో హాఫ్ సెంచరీ కొట్టేసిన స్కంద..

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను మాస్ సంభవం 'స్కంద' బాక్స్ ఆఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టేసింది.

  • Published On : October 5, 2023 / 03:07 PM IST

Ram Pothineni Boyapati Srinu Skanda Collections update

Skanda Collections : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన సినిమా ‘స్కంద‌’. రామ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబ‌ర్ 28న పక్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రామ్ ఎనర్జీకి బోయపాటి మాస్ తోడై మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో థియేటర్ వద్ద మాస్ జాతర షురూ అయ్యింది. అదిరిపోయే కలెక్షన్స్ అందుకొని రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ దిశగా వెళ్తుంది.

మొదటి రోజు రూ.18.2 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించి రామ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇక ఆ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.56.6 కోట్ల గ్రాస్ ని అందుకొని సూపర్ హిట్టు దిశగా ముందుకు వెళ్తుంది. ఓవర్ సీస్ లో కూడా ఈ మూవీకి మంచి స్పందన వస్తుంది. అక్కడ కూడా హాఫ్ మిలియన్ వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. మరో ఫుల్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Also Read : Rashmika Mandanna : రష్మిక మందన్న తల్లిని చూశారా..? మదర్‌లా కాదు సిస్టర్‌లా కనిపిస్తున్నారు..

మరో వారం వరకు టాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ లు ఏం లేవు. ఇది స్కందకి కలిసొచ్చే విషయం. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ సుమారు రూ.45 కోట్ల వరకు జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే.. ఈ చిత్రం దాదాపు రూ.90 కోట్ల పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి బ్రేక్ ఈవెన్ సాధించి రామ్ కి సూపర్ హిట్టుని అందిస్తుందో లేదో చూడాలి. కాగా ఈ మూవీకి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసేశాడు బోయపాటి. మరి అది ఎప్పుడు ఉంటుందో చూడాలి.