Rashmika Mandanna : రష్మిక మందన్న తల్లిని చూశారా..? మదర్‌లా కాదు సిస్టర్‌లా కనిపిస్తున్నారు..
రష్మిక మందన్న తల్లిని చూశారా..? ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. మదర్‌లా కాదు సిస్టర్‌లా..

Rashmika Mandanna shares her mother photo in instagram
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. నేషనల్ వైడ్ ఈ అమ్మడికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక నెట్టింట రష్మిక ఏం పెట్టిన అది వైరల్ కావాల్సిందే. తాజాగా ఈ భామ.. తన తల్లి ఫోటోని షేర్ చేసింది. “అమ్మతో గాసిప్స్. ఈ పిక్ నాలుగు రోజులు క్రిందటది. ఇప్పుడు ఆమెను మిస్ అవుతున్నా” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక, తన తల్లి వేరువేరు చోటుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు ఆ ఫోటో క్రింద కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ‘మీరు సేమ్ మీ అమ్మలాగానే ఉన్నారు’, ‘ఇద్దరు చాలా అందంగా ఉన్నారు’, ‘ఆవిడా మదర్‌లా కాదు సిస్టర్‌లా కనిపిస్తున్నారు’.. అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి రష్మిక మందన్న మదర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Also Read : Rathika : శివాజీ, ప్రశాంత్‌లను మిస్ అవుతున్నానంటూ రతిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
View this post on Instagram
కాగా రష్మిక సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాలు చేస్తుంది. యానిమల్ ఈ ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ ఆగష్టులో రిలీజ్ కానుంది. వీటితో ధనుష్, శేఖర్ ఖముల సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే తెలుగులో ‘రెయిన్ బో’ అనే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటిస్తుంది. రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే RT4GM సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.