Double Ismart : డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన రామ్.. మళ్ళీ అదే సమయంలో..
డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ పై ఓ క్లారిటీ ఇచ్చేసిన రామ్. మళ్ళీ అదే సమయానికి వచ్చి..
- gum 95921
- Published On : March 21, 2024 / 03:24 PM IST
Ram Pothineni gave clarity on Double Ismart movie release date
Double Ismart : దర్శకుడు పూరి జగన్నాధ్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి తమ కెరీర్ లో మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. వరుస ప్లాప్స్ ని చూస్తున్న వీరిద్దరికి ఈ చిత్రం మంచి ఊరట ఇచ్చింది. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ.. ప్రస్తుతం మళ్ళీ ప్లాప్స్ లోనే ఉన్నారు. దీంతో మళ్ళీ ఒక మంచి కమ్‌బ్యాక్ అందుకోవడం కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. తమకి బూస్ట్ ఇచ్చిన సినిమానే నమ్ముకొని సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు.
‘డబల్ ఇస్మార్ట్’ అంటూ సీక్వెల్ ని ప్రకటించి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మార్చి నుంచి వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. అసలు ఏప్రిల్ నుంచి ఇతర సినిమాలు డేట్స్ లాక్ చేసుకొని ఉండడమే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావుడి కూడా ఉంది.
Also read : Vishwambhara : ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్.. కీరవాణితో మెగాస్టార్, త్రిష..
దీంతో ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని రామ్ ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఫ్యాన్స్ పడుతున్న ఈ టెన్షన్ ని తగ్గించడం కోసం రామ్.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చేశారు. జూన్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు రామ్ తెలియజేసారు. ఆ టైంకి ఎన్నికల హడావుడి అంతా కూడా ముగిసిపోతుందని, జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ రామ్ తెలియజేశారు.
సమ్మర్ హాలిడేస్ అయిపోయే టైంకి వచ్చి థియేటర్స్ లో ఇంకో భారీ హిట్ కొట్టడానికి రామ్, పూరి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇస్మార్ట్ శంకర్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుని అందుకుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ని కూడా ఆ కలిసొచ్చిన సమయానికే తీసుకు రావాలని పూరి, రామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 14న రిలీజ్ కి డేట్ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.
Ustaad @ramsayz About #DoubleISMART #DoubleISMART ? releasing in June ??#RAmPOthineni #RAPO #RAPOxCMR pic.twitter.com/WnC9y5QaCv
— RAm POthineni Fc (@PothineniFc) March 20, 2024
