Vishwambhara : ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్.. కీరవాణితో మెగాస్టార్, త్రిష..

చిరంజీవి అంజి సినిమా తర్వాత మరోసారి సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి.

Vishwambhara : ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్.. కీరవాణితో మెగాస్టార్, త్రిష..

Megastar Chiranjeevi and Trisha Meets Music Director Keeravani for Vishwambhara

Updated On : March 21, 2024 / 1:06 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వశిష్ఠ(Director Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి అంజి సినిమా తర్వాత మరోసారి సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి ఓ పక్కన షూటింగ్ జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా నేడు ఉదయం కీరవాణి దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి, త్రిష(Trisha) వెళ్లి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారు. ఓ పక్క మెగాస్టార్ మరో పక్క ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో త్రిష ఫొటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Paravateesam : ప్రమోషన్స్ కోసం అందరితో కొట్టించుకుంటున్న హీరో.. శ్రీముఖితో చెంపదెబ్బ..

త్రిష ఫోటోని షేర్ చేస్తూ.. ఒక గొప్ప భక్తిమయమైన ఉదయం అని పోస్ట్ చేసింది. దీంతో త్రిష షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక విశ్వంభర సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)