×
Ad

Ram Pothineni : ఛాన్స్ వస్తే కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా.. మొన్న రామ్ చరణ్, ఇప్పుడు రామ్ పోతినేని..

గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా తీయాలని పలువురు బాలీవుడ్(Bollywood) ప్రముఖులు ట్రై చేస్తున్నారు. అయితే ఈ బయోపిక్ లో విరాట్(Virat Kohli) లాగా ఎవరు నటిస్తారు అని పెద్ద ప్రశ్నగా మారింది.

  • Published On : September 24, 2023 / 07:54 AM IST

Ram Pothineni wants to act in Virat Kohli Biopic if he get a chance

Ram Pothineni :  ఇటీవల బయోపిక్స్(Biopic) ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో పలు రంగాల్లో ఉన్న ప్రముఖుల బయోపిక్ లను తీసి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రికెటర్స్ బయోపిక్ లు కూడా వస్తున్నాయి. ధోని బయోపిక్ అయితే భారీ విజయం సాధించింది. గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా తీయాలని పలువురు బాలీవుడ్(Bollywood) ప్రముఖులు ట్రై చేస్తున్నారు.

అయితే ఈ బయోపిక్ లో విరాట్(Virat Kohli) లాగా ఎవరు నటిస్తారు అని పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నాళ్ల క్రితం రామ్ చరణ్(Ram Charan) విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడు అని వార్తలు వచ్చాయి. చరణ్ విరాట్ కి దగ్గర పోలికలు ఉంటాయని, బాడీ కూడా అంతే ఫిట్ గా మెయింటైన్ చేస్తాడని, చరణ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని బాలీవుడ్ వాళ్ళు అభిప్రాయపడ్డారు. చరణ్ కూడా ఛాన్స్ వస్తే కచ్చితంగా విరాట్ బయోపిక్ లో నటిస్తాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also Read : Bigg Boss 7 Day 20 : ఈ వారం పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు? వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌పై ఫైర్ అయిన నాగార్జున..

తాజాగా ఇప్పుడు మరో హీరో విరాట్ బయోపిక్ లో ఛాన్స్ వస్తే నటిస్తాను అని చెప్తున్నాడు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల మాస్ సినిమాల్లోకి మారుతున్నాడు. త్వరలో రామ్ స్కంద సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కి, నాకు దగ్గరి పోలికలు ఉన్నాయని పలువురు చెప్పారు. విరాట్ బయోపిక్ లో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నాడు. మరి విరాట్ బయోపిక్ ఎప్పుడు వస్తుందో, బయోపిక్ లో ఎవరు నటిస్తారో చూడాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.