Bigg Boss 7 Day 20 : ఈ వారం పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు? వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌పై ఫైర్ అయిన నాగార్జున..

గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. శివాజీ, సందీప్ తప్ప మిగిలిన వాళ్లంతా వాళ్ళిద్దర్నీ తప్ప వేరే వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చి ఆ టైటిల్ ఉన్న బ్యాడ్జీలని పెట్టమన్నాడు నాగ్.

Bigg Boss 7 Day 20 : ఈ వారం పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు? వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌పై ఫైర్ అయిన నాగార్జున..

Bigg Boss 7 Day 20 highlights who win Powerastra who aregame changer and safe gamer in bigg boss house

Updated On : September 24, 2023 / 7:08 AM IST

Bigg Boss 7 Day 20 :  బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ లో పవరాస్త్ర కోసం శోభాశెట్టి, ప్రియాంక మధ్య టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో కొన్ని సెకండ్స్ ఎక్కువ సేపు ఎద్దు మీద కూర్చొని శోభాశెట్టి గెలిచి పవరాస్త్ర గెలుచుకుంది నాగార్జున ప్రకటించాడు. ఇక గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. శివాజీ, సందీప్ తప్ప మిగిలిన వాళ్లంతా వాళ్ళిద్దర్నీ తప్ప వేరే వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చి ఆ టైటిల్ ఉన్న బ్యాడ్జీలని పెట్టమన్నాడు నాగ్.

ముందుగా ప్రియాంక.. శోభాశెట్టి గేమ్ ఛేంజర్ అని, శుభశ్రీ సేఫ్ గేమర్ అని ట్యాగ్ ఇచ్చింది. శుభశ్రీ.. యావర్ గేమ్ ఛేంజర్ అని, తేజ సేఫ్ గేమర్ అని బ్యాడ్జెస్ పెట్టింది. ప్రశాంత్.. యావర్ గేమ్ ఛేంజర్ అని, తేజ సేఫ్ గేమర్ అని చెప్పాడు. గౌతమ్.. ప్రియాంక గేమ్ ఛేంజర్ అని, తేజ సేఫ్ గేమర్ అని చెప్పాడు. దామిని.. యావర్ గేమ్ ఛేంజర్ అని, అమర్ దీప్ సేఫ్ గేమర్ అని చెప్పింది. తేజ.. ప్రియాంక గేమ్ ఛేంజర్ అని, అమర్ దీప్ సేఫ్ గేమర్ అని చెప్పాడు. శోభాశెట్టి.. ప్రియాంక గేమ్ ఛేంజర్ అని, ప్రశాంత్ సేఫ్ గేమర్ అని చెప్పింది. యావర్.. ప్రశాంత్ గేమ్ ఛేంజర్ అని, దామిని సేఫ్ గేమర్ అని చెప్పాడు. అమర్ దీప్.. దామిని గేమ్ ఛేంజర్ అని, రతిక సేఫ్ గేమర్ అని చెప్పాడు. రతిక.. యావర్ గేమ్ ఛేంజర్ అని, తేజ సేఫ్ గేమర్ అని చెప్పింది. ఇలా అందరూ ఆ ట్యాగ్స్ ఉన్న బ్యాడ్జీలు పెట్టారు.

ఎక్కువ సేఫ్ గేమర్ బ్యాడ్జీలు గెలుచుకున్న తేజకి నాగ్ ఈ వారం అంత హౌస్ లో పాత్రలు క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇచ్చాడు. అనంతరం ఒక్కొక్కరి పేరు చెప్తూ, వాళ్ళు చేసిన పనులు చెప్తూ కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా ఎప్పటిలాగే ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు నాగార్జున. గేమ్ ఆడకుండా ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు, ఏడిస్తే బిగ్ బాస్ కరుణించడు అని అన్నారు. ఇక రతికకి కూడా ఇంకా ఎన్నాళ్ళు నీ గతాన్ని, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకొని బాధపడతావు అని ఫైర్ అయ్యాడు నాగ్.

Also Read : Bigg Boss 7 : ‘నువ్వు కంటెండర్‌వి కాదు. నిన్నెందుకు పిలుస్తారు..’ నాగార్జున ఫైర్‌

నేడు ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందని తెలిసిందే. శనివారం ఎపిసోడ్స్ లోనే నామినేషన్స్ నుంచి యావర్ ని సేవ్ చేశారు. ఇక మిగిలినవి నేటి ఎపిసోడ్ లో ఉంటాయి. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి.