Mahesh Babu : బాబాయ్ పాటకి కూతురు డాన్స్ అదుర్స్.. అక్క వీడియోపై చెల్లి సితార కామెంట్స్..
రమేష్ బాబు కూతురు భారతి తన బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. ఇక అక్క చేసిన డాన్స్ పై చెల్లి సితార కామెంట్స్ ఏంటంటే..
- gum 95921
- Published On : February 19, 2024 / 10:00 AM IST
Ramesh Babu Daughter bharathi ghattamaneni dance for mahesh babu song
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్ తో తమ మార్నింగ్ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దాని పై మహేష్ కూడా రెస్పాండ్ అయ్యారు.
ఇక ఈ పాటని ఆడియన్స్ అంతా ఇన్‌స్టా రీల్స్ తో రీ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు కూడా ఓ రీల్ చేసింది. రమేష్ బాబుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి జయకృష్ణ, కూతురు భారతి. సినిమా వర్గాల్లో పెద్దగా కనిపించని ఈ ఇద్దరు వారసులు.. ఆ మధ్య రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ తో కలిసి వీరిద్దరూ ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
Also read : Shankar : అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి.. దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు.. ఫోటోలు వైరల్
తాజాగా భారతి తన బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. గ్రేస్‌తో ఊరమస్ గా స్టెప్పులు వేసిన భారతి డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై చెల్లెలు సితార రియాక్ట్ అవుతూ వరుస కామెంట్స్ చేస్తూ వచ్చింది. లేడీస్ అండ్ జెంట్లేమెన్, గార్జియస్ వుమెన్, ఓ.. అంటూ సితార వరుస కామెంట్స్ చేస్తూ అక్క వీడియో పై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కాగా ఇన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న భారతి.. ఇప్పుడు మెల్లిమెల్లిగా యాక్టీవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు తన ఇన్‌స్టా బయోలో ఇలా రాసుకొచ్చారు.. Drive in Cinema. ఇది చూస్తుంటే, త్వరలో భారతి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా అనే సందేహం కలుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
