అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి.. దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు.. ఫోటోలు వైరల్

అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు. అక్క ఎంగేజ్మెంట్ వేడుకలో చెల్లెలు సందడి.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి.. దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు.. ఫోటోలు వైరల్

Game Changer director Shankar elder daughter engagement photos

Director Shankar : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఆదివారం నాడు ఈ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. శంకర్ కి మొత్తం ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి. ఇక ఈ ముగ్గురిలో రెండో అమ్మాయి అదితి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమయ్యారు.

ఇక ఇప్పుడు జరిగిన పెద్ద కూతురు ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే.. శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసే వ్యక్తినే ఐశ్వర్య వివాహం చేసుకోబోతుంది. తరుణ్ కార్తీక్ తో గత కొంతకాలంగా ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు.. తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. ఇక ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను అదితి తన ఇన్‌స్టాలో షేర్ చేసారు.

Also read : RC16 : రామ్‌చరణ్ సినిమాలో ఆమె హీరోయిన్.. కన్ఫార్మ్ చేసిన తండ్రి..

Game Changer director Shankar elder daughter engagement photos

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)

కాగా ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. 2021లో ఐశ్వర్యకి మొదటి పెళ్లి అయ్యింది. ప్రముఖ బిజినెస్ మెన్ కొడుకు మరియు క్రికెటర్ అయిన రోహిత్ తో ఐశ్వర్య మొదటి వివాహం జరిగింది. కరోనా డేస్ లో జరిగిన ఈ పెళ్లి.. చాలా గ్రాండ్ గానే జరిగింది. లగ్జరీ రిసార్ట్ లో చాలా ఖర్చుతో శంకర్ ఆ పెళ్లిని చేసారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు ముఖ్య ప్రముఖులు ఆ పెళ్లికి హాజరయ్యారు.

పెళ్లి తరువాత రిసెప్షన్ ని అంతకుమించి గ్రాండ్ గా ప్లాన్ చేసారు శంకర్. 2022లో ఈ రిసెప్షన్ పార్టీ జరగాల్సి ఉంది. కానీ ఈలోపు అమ్మాయిని శారీరకంగా వేధించారంటూ రోహిత్ పై ఆరోపణలు రావడం, పోక్సో కేసు వరకు వెళ్లడంతో.. శంకర్ రిసెప్షన్ ని క్యాన్సిల్ చేసేసారు. ఆ తరువాత ఐశ్వర్య, రోహిత్ పెళ్లి బ్రేక్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు తన దగ్గర పని చేసే వ్యక్తికే శంకర్ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.