Ramoji rao : అతిథి పాత్రలో నటించిన రామోజీరావు.. ఏ మూవీనో తెలుసా..?
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎంతో మందికి తెలుసు.
- Thota Vamshi Kumar
- Published On : June 8, 2024 / 12:01 PM IST
Ramoji rao acted in Marpu movie as Judge
Ramoji : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎంతో మందికి తెలుసు. ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాతో నిర్మాతగా మారారు. దాదాపు 80 పైగా సినిమాలను నిర్మించారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాళీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి.
నిర్మాతగా రామోజీరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన ‘దాగుడుమూతల దండాకోర్’. కాగా.. ఆయన నిర్మాతగానే సినిమాలకు తోడ్పాటు అందించారని అనుకుంటుంటారు. కానీ ఆయన ఓ చిత్రంలో నటించారు అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.
SS Rajamouli : రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి : రాజమౌళి
సినిమాలంటే ఇష్టపడే రామోజీరావు ఓ మూవీలో అతిథిగా నటించారు. 1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్లపై రామోజీరావు బొమ్మ ప్రచురించడం గమనార్హం.
