×
Ad

Rana Daggubati : బెట్టింగ్ యాప్స్ కేసు.. సీఐడీతో ముగిసిన రానా, విష్ణుప్రియ విచారణ.. రానా ఏం చెప్పాడు?

నేడు రానా, విష్ణుప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు.(Rana Daggubati)

Rana Daggubati

Rana Daggubati : ఇటీవల పలు సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ పెట్టినందుకు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ చేతికి బెట్టింగ్ కేసు వెళ్ళడంతో సెలబ్తిట్లను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు రానా, విష్ణుప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు.(Rana Daggubati)

గంటన్నర పాటు విచారణ సాగింది. ఈ విచారణ కు రానా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో హాజరయ్యాడు. బెట్టింగ్‌ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్‌పై, యాప్‌ ప్రమోషన్‌తో వచ్చిన పారితోషికంపై సీఐడీ రానాను ప్రశ్నించింది. ఈ విచారణలో హీరో రానా.. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసాను. నా లీగల్ టీం దాన్ని పూర్తిగా వెరిఫై చేసింది. స్కిల్‌ బేస్డ్‌ గేమ్‌ యాప్‌ను మాత్రమే ప్రమోట్‌ చేశానని, వివరాలన్నీ అధికారులకు ఇచ్చానని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి విచారణకు సహకరించానని తెలిపాడు.

Also Read : Pinky Sudeepa : ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీని గుర్తుపట్టారా..? తల్లి అయిన పింకీ సుదీప.. వీడియో వైరల్..

యాంకర్ విష్ణుప్రియ కూడా సీఐడీ విచారణకు హాజరయి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.