Rana Daggubati Helth Issues: పాపులర్ తెలుగు ఓటీటీ అక్కినేని సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ అనే టాక్ షోను ఇటీవల స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రానా దగ్గుబాటి, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ షో లో పాల్గొన్నారు. సోమవారం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రానా తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు చెప్పి కంటతడి పెట్టించారు.
సరదాగా సామ్ ని పంపించేశాను అంటూ సెట్లోకి అడుగుపెట్టిన రానా నవ్విస్తూనే ఏడిపించారు.
వెంటనే సమంత స్పందిస్తూ.. ‘మీ చుట్టూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ధైర్యంగా ఉన్నార’ని అన్నారు. రానా ఆరోగ్యం గురించి చెబుతున్నప్పుడు ఆడియెన్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు..
https://10tv.in/samantha-naga-chaitanya-in-maldives/
అలాగే నాగ్ అశ్విన్ ఎలక్ట్రానిక్ కార్ గురించి, రానా, మిహికాతో పరిచయం గురించి కూడా గ్లింప్స్‌లో మాట్లాడారు. రానా ఫ్యాన్స్, ప్రేక్షకులు నవంబర్ 27న స్ట్రీమింగ్ కాబోయే ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..