Rana Daggubati : నేషనల్ అవార్డ్స్ కాంట్రవర్సీపై స్పందించిన రానా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంలోని నటనకు గాను అల్లు అర్జున్‌ను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది.
- Thota Vamshi Kumar
- Published On : September 4, 2023 / 04:03 PM IST
Jai Bhim National Award Controversy
Rana Daggubati : కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ చిత్రంలోని నటనకు గాను అల్లు అర్జున్‌ను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా బన్ని చరిత్ర సృష్టించాడు. అయితే.. సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ చిత్రానికి జాతీయ అవార్డుల్లో స్థానం దక్కలేదు. దీంతో చాలా మంది అభిమానులు నిరాశ పడ్డారు. దీనిపై పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Bigg Boss 7 : బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్స్‌కి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు..?
అయితే.. వాటిలో కొన్ని తీవ్ర చర్చనీయాంశం అవ్వగా, మరికొన్ని మాత్రం వివాదాలకు దారితీశాయి. తాజాగా దీనిపై నటుడు రానా దగ్గుబాటి స్పందించారు. సైమా అవార్డ్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రానా మాట్లాడారు. సాధారణంగా సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవన్నారు. ఒకరికి ఓ సినిమా నచ్చితే మరొకరికి ఇంకొ సినిమా నచ్చుతుందని తెలిపారు.
Rashmika Mandana : రష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
అర్టిస్టుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయన్నాడు. చాలా మంది జైభీమ్ చిత్ర కథకు జాతీయ అవార్డు వస్తుందని బావించారు. అయితే.. అలా జరగలేదు. దీంతో కొందరు వారి అభిప్రాయలు చెబుతూ ట్వీట్ చేశారు. అంతే తప్ప వారు కాంట్రవర్సీలు చేయాలని అనుకోలేదు. కానీ.. మరికొందరు కావాలనే వాటిని కాంట్రవర్సీలుగా మార్చారని అన్నారు. ఇక ఆర్టిస్టుల మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పుకొచ్చారు రానా.
