×
Ad

Rana: బాహుబలి కోసం అధిక బరువు.. గుండె, కిడ్నీ సమస్యలు.. పాడ్ కాస్ట్ లో షాకింగ్ విషయాలు చెప్పిన రానా

తన ఆరోగ్య సమస్యల గురించి రీసెంట్ పాడ్ కాస్ట్ లో షాకింగ్ విషయాలు చెప్పాడు రానా(Rana).

Rana makes shocking comments about his health problems

Rana: టాలీవుడ్ హల్క్ గా పేరుతెచ్చుకున్నాడు హీరో రానా దగ్గుబాటి. ఆయన హైట్, పర్సనాలిటీ హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటాయి. ఇక బాహుబలిలో ఆయన కనిపించిన తీరు మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. భల్లాలదేవ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. రానా సినీ చరిత్రలో బాహుబలి అనేది చాలా ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు. కానీ, ఆ సినిమా తరువాత రానా చాలా ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. బాహుబలి కోసం ఏకంగా 4 నాలుగు సంవత్సరాల పాటు ఒక రకమైన బరువును మైంటైన్ చేయడం అనేది మాములు విషయం కాదు.

దానివల్ల ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదట. తాజాగా ఈ విషయాల గురించి ఒక పాడ్ కాస్ట్ లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు రానా(Rana). బాహుబలి సినిమా కోసం నన్ను బాడీ పెంచాలని, వెయిట్ పెంచాలని ఎవరు అడగలేదు. కానీ, ఇంతకుముందు అలా చేసినవారిని నేను చూశాను. అది వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనేది నాకు తెలియదు. కానీ, చాలా కష్టమైనది. సాదరంగా ఆహారపు అలవాట్లతో అలా చేయడం చాలా కష్టం. అందుకోసం ప్రత్యేకమైన ఆహరం అవసరం. అంటూ చెప్పుకొచ్చాడు.

Hebah Patel: చీరలో స్టన్నింగ్ బ్యూటీ హెబ్బా పటేల్.. గ్లామరస్ ఫొటోలు వైరల్

నిజానికి, బాహుబలి సినిమా తరువాత రానా ఒక్కారిగా సన్నగా మారిపోయాడు. గుర్తుపట్టలేనంతగా. ఆ అవతారం చూసి అందరు షాక్ అయ్యారు. రానాకు ఏమయ్యింది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక బాహుబలి కోసం చేసిన వర్కవుట్స్ వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రానా. అందుకోసం ఏకంగా విదేశాలకు వెళ్లి మరీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రానాకి కిడ్నీ మార్పిడి కూడా జరిగింది అనే వార్తలు కూడా వినిపించాయి. బాహుబలి వల్ల చాలా సినిమాలను కూడా వదులుకున్నాడు రానా.

కానీ, ఆ విషయం గురించి వివరంగా వివరించలేదు రానా. దాంతో, ఆ టాపిక్ అలాగే సస్పెన్స్ గానే మిగిలిపోయింది. బాహుబలి తరువాత కూడా అనారోగ్య సమస్యల వల్ల సినిమాలను వదులుకున్నా అని కూడా చెప్పాడు రానా. తీసుకున్న చెక్కులు కూడా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి ఏర్పడిందట. అలా దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు రానా.

కేవలం రానా మాత్రమే కాదు, బాహుబలి తరువాత ప్రభాస్ కూడా తీవ్రమైన మోకాలి సమస్యలను ఎదుర్కొన్నాడు. అందుకోసం చిన్న సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది ప్రభాస్. నిజానికి శరీరాన్ని భారీగా పెంచి మళ్ళీ తగ్గించడం అనేది చాలా ప్రమాదకరమైన పని. ఏది ఎవరు చేసిన అదే ప్రభావం చూపిస్తుంది. దంగల్ సినిమా కోసం ఆమిర్ ఖాన్ దాదాపు 97 కిలోల వరకు పెరిగాడు. అదే సినిమాలో రెండవ పాత్ర కోసం ఏకంగా 20 కిలోలు తగ్గాడు. ఆ సమయంలో ఆ వార్త సెన్సేషన్ అయ్యింది. ఆ సినిమా కోసం ఆమిర్ ఖాన్ ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు అని చెప్పుకోవచ్చు.