Ranbir Kapoor : ఏడాదిన్నర కూతురికి బంగ్లాని బహుమతిగా ఇచ్చిన రణ్‌బీర్.. దాని విలువ తెలిస్తే షాక్ అవుతారు..
ఏడాదిన్నర కూతురికి కోట్ల విలువ చేసే బంగ్లాని బహుమతిగా ఇచ్చిన రణ్‌బీర్. దాని విలువ తెలిస్తే షాక్ అవుతారు..
- gum 95921
- Published on- March 29, 2024 / 09:29 PM IST
Ranbir Kapoor gifted a costly bungalow to his daughter
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి స్టార్స్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. కాగా వీరిద్దరికి 2022లో ‘రహ’ అనే పాప పుట్టిన సంగతి తెలిసిందే. ముత్తాత రాజ్ కపూర్ పోలికలతో పుట్టిన రహ.. తన క్యూట్ లుక్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా రణ్‌బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు.
ముంబై బాంద్రాలోని తమ ‘కృష్ణ రాజ్’ బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్‌బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది. ఏడాదిన్నర వయసులోనే రహ 250 కోట్లకు యజమాని అయ్యింది. కాగా రణ్‌బీర్ అండ్ అలియాకి ఈ బంగ్లాతో పాటు మరో నాలుగు బంగ్లాలు కూడా ఉన్నాయి. అయితే వాటి విలువ మొత్తం 60 కోట్ల పైబడి మాత్రమే ఉంటుందని సమాచారం.
Also read : Anupama Parameswaran : ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవారు.. అప్పుడు ఎందుకు అలా.. మీడియాతో అనుపమ..
ఇక రణ్‌బీర్ సినిమాల విషయానికి వస్తే.. రామాయణం కథలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటీవలే ఈ ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. రణ్‌బీర్ ప్రస్తుతం విలువిద్యలు నేర్చుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని నితేశ్ తివారీ మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇక సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
